: విశాఖలో 110 ఎకరాల్లో రూ.1750 కోట్లతో ఏషియన్ పెయింట్స్ యూనిట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏషియన్ పెయింట్స్ సంస్థ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. విశాఖ జిల్లా పూడి గ్రామంలో ఏషియన్ పెయింట్స్ సంస్థ కొత్త యూనిట్ ను స్థాపించనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, 110 ఎకరాల్లో 1750 కోట్ల రూపాయలతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ఏడాదికి 4 లక్షల కిలోలీటర్ల సామర్థ్యం ఉన్న ఈ పరిశ్రమ ద్వారా 700 మందికి నేరుగా ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు. విశాఖ జిల్లాలో పరిశ్రమలు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన తెలిపారు. పరిశ్రమలకు దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన పన్ను రాయితీలు రావాల్సి ఉందని, ఆ తర్వాతే పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని ఆయన వివరించారు.