: పంతం నెగ్గించుకున్న మోదీ ప్రభుత్వం... భూసేకరణ బిల్లుకు ఆమోదం
కేంద్రం పంతం నెగ్గించుకుంది. భూసేకరణ బిల్లుకు ఆమోదం పొంది తీరుతామని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం లోక్ సభలో 11 సవరణలు సూచిస్తూ, బిల్లును ఓకే చేయించుకుంది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన సవరణలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తోసిపుచ్చారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 11 సవరణలను ఎంపీలు ఆమోదించారు. తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. బిల్లులో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న 'రైతుల ఆమోదంతో' అనే క్లాజును బీజేపీ ప్రభుత్వం తొలగించింది. దీంతో, విపక్షాలు భగ్గుమన్నాయి. రైతులను నిరాశ్రయులను చేసే సవరణలను తాము ఆమోదించలేమని ప్రతిపక్షాలు పేర్కొన్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. లోక్ సభలో బిల్లు పాస్ కావడంతో సగం లాంఛనం పూర్తైంది. రాజ్యసభలో బిల్లు పాస్ అయితే, భవిష్యత్ లో రైతుల ప్రమేయం లేకుండా ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూములను సేకరించవచ్చు.