: మోదీ తీరుపై ఘాటు కవిత... సస్పెండైన బీజేపీ మీడియా ఇన్ఛార్జ్
ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై ఘాటు కవిత రాసిన ఆగ్రా బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ పాతిక్ సస్పెండయ్యారు. ఆయన రాసిన కవిత సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ కవితకు లైకులు, షేర్లు బాగా వచ్చాయట. హిందూ సంస్థలకు చెందిన నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఎక్కువ మంది లైక్ చేసినట్టు తెలిసింది. కాశ్మీర్ లో పీడీపీకి మద్దతివ్వడం ద్వారా పాముకి పాలు పోసి పెంచుతున్నారని, తొందర్లోనే ఈ పాము మోదీని కాటేసే అవకాశం ఉందంటూ ఆ కవితలో ఘాటుగా విమర్శించారట. సస్పెన్షన్ పై పాతిక్ స్పందిస్తూ, తాను తప్పుగా మాట్లాడలేదని, ఇది తన ఒక్కడి వాదన కాదని, వేర్పాటు వాద పార్టీతో బీజేపీ కలవడాన్ని దేశ ప్రజలు ఒప్పుకోవడం లేదని అన్నారు. ఈ నిర్ణయం విమర్శలపాలవుతోందని ఆయన చెప్పారు.