: మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు పదవ తరగతి విద్యార్థులకు ప్రయాణం ఉచితం
పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ప్రయాణ కష్టాలు తీర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. పరీక్షల హాల్ టికెట్లు చూపించి ఆర్డినరీ బస్సులలో ఉచిత ప్రయాణం చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కాంబినేషన్ టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చని ఈ సందర్భంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.