: లోపాల నేపథ్యంలో 33 వేల ఆల్టో వాహనాలు వెనక్కి
మారుతీ సుజుకీ సంస్థకు చెందిన ఆల్టో 800, ఆల్టో కే10 వాహనాలను వెనక్కి తీసుకోనుంది. ఆల్టో వాహనాల్లో గుర్తించిన సాంకేతిక లోపాలను సరిదిద్దాలని నిర్ణయించిన మారుతీ సుజుకీ దాదాపు 33 వేల వాహనాలను వెనక్కి రప్పించనుంది. ఈ మేరకు మారుతి సుజుకీ సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది. ఆల్టో శ్రేణి వాహనాల్లో కుడివైపు డోర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఆ వాహనాలను వెనక్కి రప్పించనుంది.