: 30న కోర్టుకు రా... రాహుల్ కు బాంబే హైకోర్టు నోటీసు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రస్తుతం సెలవులో ఉన్న నేత రాహుల్ గాంధీని ఈనెల 30వ తేదీన కోర్టుకు హాజరుకావాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి తహిల్యానీ సమన్లు జారీ చేశారు. గత సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహత్మా గాంధీ హత్య అంశంపై ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారని, గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్ కారణమని రాహుల్ అన్నారని ఆర్ఎస్ఎస్ సభ్యుడు రాజేష్ కుంతే కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై గతంలో రాహుల్ గైర్హాజరుకు అనుమతించిన కోర్టు ఈ దఫా మాత్రం అందుకు అనుమతించ లేదు. ఈనెల 30వ తేదీన భీవండి కోర్టు ముందు హాజరు కావాలని రాహుల్ కు హైకోర్టు సూచించింది.