: మా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు: ధోనీ


ప్రపంచకప్ లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసించాడు. వరుసగా ఐదు మ్యాచ్ లలో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేయడం పట్ల ధోనీ హర్షం వ్యక్తం చేశాడు. బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని కితాబిచ్చాడు. పిచ్ తో సంబంధం లేకుండా టీమిండియా బౌలర్లు రాణిస్తున్నారని కొనియాడాడు. పరుగులకు అడ్డుకట్ట వేస్తూ, కీలక సమయాల్లో వికెట్లు కూల్చుతున్నారని ధోనీ పేర్కొన్నాడు. బౌలర్లు ఇచ్చిన స్పూర్తిని బ్యాట్స్ మెన్ కొనసాగిస్తున్నారని ధోనీ తెలిపాడు. జట్టుగా రాణిస్తే మంచి ఫలితాలు వస్తాయని ధోనీ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News