: ఏపీ కరవు మండలాల జాబితాలో మరో ఎనిమిది
ఆంధ్రప్రదేశ్ లో కరవు మండలాల జాబితాలో మరో 8 మండలాలు చేరాయి. కర్నూలు జిల్లాలోని ఎనిమిది మండలాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరవు మండలాలుగా మిడ్తూరు, ఆలూరు, చిప్పగిరి, దేవనకొండ, తుగ్గలి, గడివేముల, జూపాడుబంగ్లా, పత్తికొండ ఉన్నాయి. వాటితో రాష్ట్రంలో కరవు మండలాల సంఖ్య 238కి చేరింది.