: తృణమూల్ ఆదాయ వివరాలు కోరిన సీబీఐ


తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదాయ వివరాలు తెలపాలని సీబీఐ కోరింది. 2010 నుంచి 2014 మధ్య పెయింటింగ్స్, డొనేషన్స్, ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు వెల్లడించాలని తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముకుల్ రాయ్ కి సీబీఐ మెయిల్ పంపింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి కూడా సీబీఐ ఇదే విషయాన్ని మెయిల్ ద్వారా పంపింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వేసిన ఓ పెయింటింగ్ ను శారదా చిట్స్ అధినేత సుదీప్త సేన్ 1.8 కోట్ల రూపాయలకు కొన్న విషయం తెలిసిందే. దీనిని ప్రస్తావించిన సీబీఐ, తృణమూల్ ఆదాయమెంత? అనే విషయాలు ఆరా తీస్తున్నట్టు లేఖలో పేర్కొంది. కాగా, దీదీ తొలిసారి ప్రధానిని నిన్న కలిసిన సంగతి తెలిసిందే. దీంతో సీపీఐ ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించింది. కేసులు లేకుండా చేసుకునేందుకు ప్రధానిని మమత కలిశారని ఆ పార్టీ ఆరోపించింది.

  • Loading...

More Telugu News