: రాజ్యసభకు పోటీ చేస్తున్న రాజ్ బబ్బర్
నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన రాజ్ బబ్బర్ ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం, తనకీ అవకాశం ఇచ్చినందుకు పార్టీ హైకమాండ్ కు, రాష్ట్ర నాయకత్వానికి బబ్బర్ కృతజ్ఞతలు తెలిపారు. తనవంటి సాధారణ కార్యకర్తపై విశ్వాసం ఉంచి తనను ఎంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఓ సభ్యుడిగా రాజ్యసభలో ఉత్తరాఖండ్ అభివృద్ధికి సంబంధించిన విషయాలను లేవనెత్తుతానని చెప్పారు. అదే తన ప్రాధాన్యమని చెప్పారు.