: ప్రియురాలిని చంపేసి... సీక్రెట్ గా లోయలో విసిరేద్దామనుకున్నాడు!
ప్రియురాలిని చంపేసిన తరువాత సీక్రెట్ గా లోయలో విసిరేద్దామనుకున్నాడు కానీ, ఓ యువకుడు చూడడంతో అతగాడి బండారం బయటపడింది. చెన్నైలో దినేష్ కన్నప్పన్ (25) ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. గత మూడేళ్లుగా అరుణ శ్రీనివాసన్ (22)తో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో దినేష్ తండ్రిని చికిత్స కోసం ఓ ఆసుపత్రిలో చేర్చాడు. అనంతరం, సోమవారం రాత్రి అయనవరంలో ఉండే అరుణ ఫ్లాట్ కు వెళ్లాడు. అనంతరం వారి మధ్య మాటామాటా పెరిగి, ఘర్షణకు దారితీసింది. దీంతో దినేష్ ఫ్లవర్ వాజ్ తో అరుణ తలపై బలంగా మోదాడు. దెబ్బ బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైన అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. దీనిని గుర్తించిన దినేష్ ఆమెను బెడ్ షీట్ లో చుట్టి కారు డిక్కీలో పెట్టి సీక్రెట్ గా లోయలో విసిరేయాలని ప్లాన్ వేశాడు. బెడ్ షీట్ లో చుట్టి అరుణ శవాన్ని కారు డిక్కీలో పెడుతుండగా అనుమానం వచ్చిన స్థానిక యువకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో, ఆ కారును వెంబడించి పట్టుకునేలోపు దినేష్ ఆమె శవాన్ని నగరశివారులోని లోయలోకి నెట్టేసి పరారయ్యాడు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.