: రియాలిటీ షో చిత్రీకరణలో విషాదం
యూరప్ లో ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'డ్రాప్డ్' చిత్రీకరణలో విషాదం చోటు చేసుకుంది. పార్టిసిపెంట్స్ తో ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 10 మంది మరణించగా, వారిలో ఫ్రాన్స్ కు చెందిన ఒలింపిక్ స్విమ్మింగ్ పసిడి విజేత కెమిల్లే ముఫాట్, ఒలింపిక్ బాక్సర్ అలెక్సిస్ వాస్టైన్, సెయిలింగ్ చాంపియన్ ఫ్లోరెన్స్ ఆర్తాడ్ ఉన్నారు. ఈశాన్య అర్జెంటీనాలోని విల్లా కాస్టెల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్న కారణంగానే కూలిపోయినట్టు భావిస్తున్నారు. ఘటనాస్థలి శకలాలు, మాంసపు ఖండాలతో బీభత్సంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. గాల్లోకెగసిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్టు తెలిసింది.