: జమ్మూకాశ్మీర్ లో పొత్తు ప్రధానం కాదు... దేశమే మాకు ముఖ్యం: రాజ్ నాథ్ సింగ్
జమ్మూకాశ్మీర్ లో సంకీర్ణంతో ప్రభుత్వం ఏర్పడిన క్రమంలో కేంద్రానికి పొత్తు ప్రధానం కాదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో చెప్పారు. కేంద్రానికి అతి ప్రధానమైన భద్రత విషయంలో తాము రాజీపడబోమని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం వేర్పాటువాద నేత మసరత్ ఆలంను విడుదల చేయడంపై కేంద్రం అంత సంతృప్తిగా లేదని చెప్పారు. దానిపై వివరణ కోరుతున్నట్టు పేర్కొన్నారు. గతవారం జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం మసరత్ ఆలంను విడుదల చేయడంతో వివాదం నెలకొంది. విపక్షాలు పార్లమెంటులో ఈ విషయంపై కేంద్రాన్ని వివరణ కోరగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు.