: సోషల్ మీడియాలో తప్పుడు ఫోటోలు పెట్టిన లాలూ కుమార్తె మీసా భారతి


ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన 'ఇండియా సదస్సు'లో తాను ప్రసంగం చేసి వచ్చానని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి తప్పుడు ఫోటోలను విడుదల చేసి చిక్కుల్లో పడ్డారు. తనను ప్రసంగించాలని వర్శిటీ ఆహ్వానించిందని, ఆ మేరకు వెళ్లి మాట్లాడానని చిత్రాలు విడుదల చేసింది. ఇవన్నీ 'ఫేక్' చిత్రాలని, ఆమెను తాము పిలవలేదని, ఒక ప్రతినిధిగా టికెట్ కొనుక్కొని ఆమె వచ్చారని సదస్సు నిర్వాహకులు రజత్ సేథి స్పష్టం చేశారు. కాగా, తన ఫేస్ బుక్ పేజీలో తను డయాస్ పై నిలబడి ప్రసంగిస్తున్నట్టు ఉన్న ఫోటోను మీసా అప్ లోడ్ చేశారు. యువత పాత్రపై హార్వర్డ్ లో మాట్లాడినట్టు కాప్షన్ పెట్టారు. ఈ ఫోటోలను బీహార్ దినపత్రికలు ప్రచురించాయి. దీంతో, ఆమె ఎటువంటి ప్రసంగం చేయలేదని హార్వర్డ్ వర్శిటీ వివరణ ఇచ్చింది. దీంతో ఆమె, ఆమెతోపాటు లాలూ ప్రసాద్ యాదవ్ పై విమర్శల వర్షం కురుస్తోంది. తన చర్యలపై ఆమె ఏం సమాధానం చెబుతారో చూడాలి.

  • Loading...

More Telugu News