: అప్పుడు చనిపోయింది వైఎస్ కాదు, పోలవరం ప్రాజెక్టు... ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధినేత కొత్తగా చెబుతున్న పట్టిసీమ ప్రాజెక్టుపై ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. పట్టిసీమ ప్రాజెక్టు 'ఉభయ భ్రష్టు ప్రాజెక్టు' అని ఉండవల్లి నేడు విమర్శించారు. 2009లో చనిపోయింది వైఎస్ రాజశేఖరరెడ్డి కాదని, పోలవరం ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరంకు అన్ని అనుమతులూ వైఎస్ఆర్ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. పట్టిసీమను పట్టుకుంటే పోలవరం ప్రాజెక్టును మర్చిపోవాల్సిందేనని వివరించారు. పట్టిసీమ ప్రాజెక్టుతో రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. చంద్రబాబు తక్షణమే పట్టిసీమను నిలిపివేసి ఆ నిధులతో పోలవరంను పూర్తి చేయాలని సూచించారు.