: రాహుల్ గాంధీ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పరువునష్టం దావా కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ఎంఎల్ తహిల్యానీ తిరస్కరించారు. అయితే, ఇదే కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతించారు. మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్సే హత్య చేసిందంటూ గతేడాది లోక్ సభ ఎన్నికల ర్యాలీలో రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో, థానే జిల్లాలోని భివాండీ మెజిస్టీరియల్ కోర్టులో ఆర్ఎస్ఎస్ పట్టణ విభాగం కార్యదర్శి రాజేష్ కుంతే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, ఈ కేసులో కోర్టు విచారణ ప్రారంభించగా, తమ ముందు హాజరుకావాలని రాహుల్ కు నోటీసు జారీ చేసింది. దాంతో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, తనపై కేసు కొట్టివేయాలని పిటిషన్ వేశారు.

  • Loading...

More Telugu News