: లోక్ సభలో అభ్యంతరం వ్యక్తం చేసిన కవిత


టీఆర్ఎస్ ఎంపీ కవిత లోక్ సభలో తన వాణి వినిపించారు. బీడీ కట్టలపై హెల్త్ వార్నింగ్ లోగో సైజును పెంచాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. లోగో సైజును పెంచితే బీడీ కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు. వేలాది కుటుంబాలు బీడీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నాయని చెప్పారు. హెల్త్ వార్నింగ్ లోగో సైజును పెంచే విషయంలో బీడీ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని ఆమె కేంద్రాన్ని కోరారు.

  • Loading...

More Telugu News