: సచిన్ రికార్డు సమం చేశాడు... ఆ వెంటనే విఫలం అయ్యాడు!
వరల్డ్ కప్ పోటీల్లో భారత్ తరపున వేగంగా శతకం నమోదు చేసిన రెండో ఆటగాడిగా ధావన్ చరిత్ర సృష్టించాడు. ఈ విషయంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ తో సమానంగా ధావన్ నిలిచాడు. 84 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్ ల సాయంతో ధావన్ 100 పరుగుల మైలురాయికి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే ధావన్ అవుట్ కావడం నిరాశ కలిగించింది. అంతకుముందు ధావన్, రోహిత్ శర్మలు కలసి తొలి వికెట్ కు అందించిన 174 పరుగుల భాగస్వామ్యం సైతం వరల్డ్ కప్ పోటీలలో అత్యధికం కావడం మరో రికార్డు. ఇంతకుముందు ఈ రికార్డు జడేజా, సచిన్ ల పేరిట వుంది. 1994 వరల్డ్ కప్ లో కెన్యా పై జరిగిన పోరులో ఈ జంట తొలి వికెట్ కు 163 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.