: రోహిత్ అవుట్... సెంచరీ శిఖరమెక్కిన ధావన్
ఐర్లాండ్ తో జరుగుతున్న పోరులో భారత ఓపెనర్ ధావన్ సెంచరీ శిఖరమెక్కాడు. కేవలం 84 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో సెంచరీని కొట్టాడు. అంతకుముందు రోహిత్ శర్మ థాంప్సన్ బౌలింగులో వికెట్ సమర్పించుకున్నాడు. 63 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 3 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 64 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 27 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 183 పరుగులు. విజయానికి మరో 80 పరుగులు సాధించాల్సి ఉండగా, భారత్ చేతిలో 9 వికెట్లు, 23 ఓవర్లు ఉన్నాయి.