: పద్ధతి మార్చుకోకపోతే బుద్ధి చెబుతాం: అరుణకు గువ్వల వార్నింగ్
అధికారపక్ష నేతను నిండు శాసనసభలో నోర్మూసుకో అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు సభలో ప్రకంపనలు పుట్టించాయి. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందించారు. అధికారం కోల్పోయిన బాధతోనే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. డీకే అరుణ గూండాయిజానికి, రౌడీయిజానికి భయపడమని గువ్వల అన్నారు. తన తీరును అరుణ మార్చుకోవాలని... లేకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సభను అడ్డుకునేందుకే విపక్షాలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.