: నిన్న సస్పెన్షన్... నేడు ఎర్రబెల్లి, రేవంత్ తదితరుల అరెస్ట్!


నిన్న తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నేడు గన్ పార్క్ వద్ద నిరసనకు దిగగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున 144 సెక్షన్ విధించామని, ఈ కారణంగా అసెంబ్లీ పరిసరాల్లో ఎలాంటి ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు వారికి చెప్పారు. అయినా వినకుండా నినాదాలతో ధర్నా చేస్తున్న ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, సండ్ర వీరయ్య, మాధవరం కృష్ణారావు, గోపీనాథ్, గాంధీమోహన్, రాజేందర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనుకు తరలించారు. అంతకుముందు టీడీపీ పట్ల టీఆర్ఎస్ సర్కార్ కక్ష సాధిస్తోందంటూ ఆ పార్టీ సభ్యులు ఆరోపించారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News