: ఇండియాలో అత్యాచారాలు ఎక్కువ... భారత విద్యార్థులను చేర్చుకోబోమన్న జర్మనీ వర్సిటీ!
యువతులు అధికంగా ఉండే తమ యూనివర్సిటీలో అత్యాచారాలు అధికంగా జరిగే ఇండియా నుంచి వచ్చే విద్యార్థులను చేర్చుకోలేమని జర్మనీకి చెందిన ప్రముఖ లీప్ జింగ్ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. విద్యార్థినులు అధికంగా ఉన్న చోట భారతీయ విద్యార్థిని ఇంటర్న్ షిప్ కు అనుమతించబోనని వర్సిటీ బయో కెమిస్ట్రీ విభాగంలో పనిచేస్తోన్న మహిళా ప్రొఫెసర్ అన్నెట్ జీ బెక్ అన్నారు. ఈ మేరకు భారత్ లోని జర్మనీ ఎంబసీకి లేఖ రాశారు. 'భారత్ లో మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ చదువుకుంటున్న వాళ్లలో అమ్మాయిలే అధికం. ఈ పరిస్థితుల్లో ఒక భారతీయ విద్యార్థిని చేర్చుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను' అన్నారు. ఇరుదేశాల విద్యా సంబంధాలపై పెను ప్రభావం చూపేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ఇండియాలోని జర్మన్ రాయబారి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరిన ఆమె అనువాదంలో తలెత్తిన లోపాలవల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు.