: లోక్ సభకు సత్యహరిశ్చంద్రుడి వేషంలో వచ్చిన చిత్తూరు ఎంపీ
టీడీపీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఈరోజు లోక్ సభకు వినూత్న వేషధారణలో వచ్చారు. పంచెకట్టుకుని, గడ్డం పెట్టుకుని, చేతిలో కర్ర, భుజంపై కుండతో పార్లమెంటు ఆవరణలో హల్ చల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలని... అది గుర్తు చేసేందుకే తాను ఇలా వచ్చానని ఎంపీ చెప్పారు. కళాకారుడు సమస్యలు చూసి వదలడని, ఆందోళన చేయకుండా ఉండలేడన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజలు ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ఓ కళాకారుడిగా తాను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. గతంలో కూడా ఎంపీ శివప్రసాద్ పలుసార్లు విభిన్న వేషాల్లో సమావేశాలకు వచ్చిన సంగతి తెలిసిందే.