: జూలు విదిల్చిన భారత్!
6 ఓవర్లపాటు సంయమనంతో ఆడిన భారత ఆటగాళ్లు ఆపై బాదుడు మొదలు పెట్టారు. ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపడం ప్రారంభించారు. 7వ ఓవర్ 3వ బంతికి మూనీ బౌలింగ్ లో ధావన్ త్రుటిలో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. భారీ షాట్ ఆడబోగా గాల్లోకి లేచిన బంతి పోటర్ ఫీల్డ్ చేతుల్లో పడి భూమిని తాకింది. ఇక ఆ తరువాత ధావన్, శర్మలు రెచ్చిపోయారు. 7వ ఓవర్ 5వ బంతిని ఫోర్ గా, 6వ బంతిని సిక్స్ గా రోహిత్ మలవగా, 8వ ఓవర్ తొలి 2 బంతులను ధావన్ బౌండరీకి తరలించాడు. ఆ తరువాత 9వ ఓవర్ 2, 3 బంతులకు ధావన్ సిక్స్, ఫోర్ సాధించి స్కోర్ బోర్డును దూకించాడు. దీంతో 6 ఓవర్లకు 23 పరుగులతో ఉన్న భారత స్కోర్ 9 ఓవర్లకు 62 పరుగులకు చేరింది.