: డీకే అరుణ ప్రవర్తన మహిళా లోకానికి సిగ్గుచేటు: మంత్రి కడియం


మహబూబ్ నగర్ టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యలు తెలంగాణ శాసనసభలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. సభలో ఆమె మాటలను తెలంగాణ హోంమంత్రి కడియం శ్రీహరి తీవ్రంగా ఖండించారు. అరుణ ప్రవర్తన మహిళా లోకానికి సిగ్గుచేటన్నారు. సభలో మహిళలు ఇలా ప్రవర్తించరని, అరుణ మాట్లాడిన తీరు సరిగా లేదని, ఆమె తీరు తలదించుకునేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుణ కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనని కడియం డిమాండ్ చేశారు. సభా సాంప్రదాయాలను కాంగ్రెస్ మంటకలుపుతోందని ఆరోపించారు. క్షమాపణ చెప్పాల్సి వస్తుందని కాంగ్రెస్ ఆందోళన చేస్తోందని, సభలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News