: మీ దాదాగిరి మహబూబ్ నగర్ లో చూపించండి... ఇక్కడ కాదు: అరుణపై కేటీఆర్ ఆగ్రహం


మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యలు తెలంగాణ శాసనసభ సమావేశాలను వేడెక్కించాయి. అధికారపక్ష సభ్యుడిని 'నోర్మూసుకో' అంటూ అరుణ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఒక మహిళా సభ్యురాలై ఉండి తోటి సభ్యుడిని నోర్మూసుకో అని తిట్టడం అత్యంత దారుణమని అన్నారు. మీరు ఎలా ఎన్నికై సభలో అడుగుపెట్టారో... టీఆర్ఎస్ సభ్యులు కూడా అలాగే ఎన్నికై సభలో కూర్చున్నారని చెప్పారు. మీ దాదాగిరి మహబూబ్ నగర్ జిల్లాలో చూపించండి... అసెంబ్లీలో కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మండలిలో ఒక్క మహిళకు కూడా స్థానం లేదంటూ అరుణ మండిపడటంపై స్పందించిన కేటీఆర్... కొన్ని సమీకరణల వల్లే మహిళకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయామని చెప్పారు. అంతేకాని, కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా మహిళా మంత్రులను, అధికారులను కేసుల్లో ఇరికించలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News