: రచ్చ చేయడమే మీ పనా?: అసెంబ్లీలో చీఫ్ విప్ కాల్వ


డ్వాక్రా రుణాల మాఫీపై చర్చను చేపట్టాలని కోరుతూ వై.యస్. జగన్ నేతృత్వంలోని వైకాపా సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగడంతో సభలో కాసేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఏ అంశంపై కూడా చర్చించరాదని ప్రతిపక్షం భావిస్తున్నట్టు ఉందని విమర్శించారు. చర్చ వదిలి రచ్చ చేయడమే పనిగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. అన్ని అంశాలపైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని, డ్వాక్రా సంఘాల గురించి మాట్లాడే హక్కు వైకాపాకు లేదని అన్నారు.

  • Loading...

More Telugu News