: ఐర్లాండ్ చెప్పుకోదగ్గ స్కోర్... భారత్ విజయ లక్ష్యం 260
చిన్నదిగా ఉన్న మైదానం, బ్యాటింగుకు అనుకూలించే పిచ్... ఇంకేం, క్రికెట్ ప్రపంచంలో అందరూ పసికూనగా భావించే ఐర్లాండ్ ఆటగాళ్లు కాస్తంత చెలరేగారు. హామిల్టన్ లో ఇండియాతో జరుగుతున్న పోరులో 49 ఓవర్లలో 259 పరుగుల చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. జట్టులో ఓపెనర్లు పోటర్ ఫీల్డ్ 67, స్టెర్లింగ్ 42 పరుగులు చేయగా, ఓబ్రియన్ 75, బాల్ బిర్నీ 24 పరుగులు చేశారు. మిగతా వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 40 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసిన ఐర్లాండ్ మిగతా 5 వికెట్లను కేవలం 38 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. భారత బౌలర్లలో షమి, అశ్విన్ లకు చెరో 2 వికెట్లు, యాదవ్, శర్మ, జడేజా, రైనాలకు తలా ఒక వికెట్ దక్కాయి. మరికాసేపట్లో 260 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది.