: 180 మందిని కాపాడి శభాష్ అనిపించుకున్న సీఐఎస్ఎఫ్


ప్రజలు ఆందోళనలకు దిగినప్పుడు వారిని అదుపు చేసేందుకు ముందుండే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఢిల్లీలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన 180 మందిని గుర్తించి వారిని కాపాడింది. వివిధ సమస్యల కారణంగా, రైలు పట్టాలపై పడి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమైన బాధితులను గుర్తించి, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా జీవితంపై కొత్త ఆశలు చిగురించేలా చేసి అధికారులతో శభాష్ అనిపించుకొంది. ఇండియాలో విమానాశ్రయాల తరువాత మాదక ద్రవ్యాలు, బంగారం అక్రమ రవాణా జరుగుతోంది మెట్రో రైళ్లలోనే కావడంతో, అన్ని మెట్రో రైల్ స్టేషన్ల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. అప్పటినుంచి సేవలందిస్తున్న సీఐఎస్ఎఫ్ పలువురి ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకోవడంతో పాటు, మహిళలకు కేటాయించిన కోచ్ లలో ప్రయాణిస్తున్న సుమారు 10 వేల మంది పురుషుల్ని దింపేశారు. 382 మంది జేబు దొంగల్ని అరెస్టు చేశారు. అయితే అందులో 90 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News