: రైనా స్పిన్ మాయాజాలం... 3 పరుగుల తేడాతో ఐర్లాండ్ మరో వికెట్ డౌన్!
టీమిండియా బ్యాట్స్ మన్ సురేశ్ రైనా బంతితో మాయాజాలం చేశాడు. మిస్టరీ బంతిని విసిరిన అతడు, ఐర్లాండ్ బ్యాట్స్ మన్ ఎడ్ జాయిస్ ను బోల్తా కొట్టించాడు. రైనా విసిరిన బంతి జాయిస్ ను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో తొలి వికెట్ పడ్డ తర్వాత మరో మూడు పరుగులకే ఐర్లాండ్ తన రెండో వికెట్ ను చేజార్చుకుంది. 89 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయిన ఐర్లాండ్, 92 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. దీంతో ఐర్లాండ్ ఆత్మరక్షణలో పడిపోయింది. కెప్టెన్ ఫోర్టర్ ఫీల్డ్ కు జత కలిసిన నియల్ ఓబ్రెయిన్ ఆచితూచి ఆడుతున్నాడు. 22 ఓవర్లు ముగిసేసరికి సెంచరీ మార్కు దాటిన ఐర్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది.