: తొలి వికెట్ కోల్పోయిన ఐర్లాండ్... వికెట్లు తీసేందుకు చెమటోడుస్తున్న టీమిండియా బౌలర్లు


భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఐర్లాండ్ తొలి వికెట్ ను కోల్పోయింది. జట్టు స్కోరు 89 పరుగులు చేరుకున్న తర్వాత రవిచంద్రన్ అశ్విన్ బౌలింగులో భారీ షాట్ కు యత్నించిన ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (41 బంతుల్లో 42 పరుగులు) కోహ్లీ చేతికి చిక్కాడు. దీంతో హాఫ్ సెంచరీ పూర్తి కాకుండానే అతడు నిరాశగా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే, ఐర్లాండ్ వికెట్లను పడగొట్టేందుకు భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు. ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు ధోనీ ఐదుగురు బౌలర్లను మార్చాడు. ఎట్టకేలకు ఫోర్టర్ ఫీల్డ్, పాల్ స్టిర్లింగ్ జోడీని అశ్విన్ విడదీశాడు. 17 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 92 పరుగులు చేసి సెంచరీకి చేరువైంది.

  • Loading...

More Telugu News