: అరసవల్లిలో మూలవిరాట్ పాదాలను ముద్దాడిన సూర్య కిరణాలు.. పరవశించిన భక్తజనం


అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో నేడు అద్భుతం చోటుచేసుకుంది. కొద్దిసేపటి క్రితం సూర్యుడి కిరణాలు ఆలయంలోని మూలవిరాట్ పాదాలను ముద్దాడాయి. ఏడాదికి రెండు సార్లు మాత్రమే సాక్షాత్కరించే ఈ అరుదైన అద్భుతాన్ని వీక్షించి భక్తజనం పరవశించిపోయింది. నిన్న తొలి రోజు భక్తులు నిరాశ చెందినా, కొద్దిసేపటి క్రితం తమ ఇష్ట దైవాన్ని సూర్యకిరణాలు ముద్దాడిన అరుదైన దృశ్యాన్ని కనులారా వీక్షించారు. ఏటా మార్చి, అక్టోబర్ మాసాల్లో సూర్యుడి కిరణాలు ఆలయంలోని సూర్య నారాయణుడి పాదాలను తాకుతాయి. ఉదయం 6- 6.15 గంటల మధ్య కేవలం 5 నిమిషాల పాటు దర్శనమిచ్చే ఈ అద్భుతంలో ప్రసరించే సూర్య కిరణాలకు శరీరంలోని అనారోగ్యాలను పారదోలే శక్తి ఉందని భక్తుల విశ్వాసం. ఈ కారణంగానే ఈ మహోన్నత ఘటనను వీక్షించేందుకు ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

  • Loading...

More Telugu News