: సెడాన్ పార్క్ లో పరుగుల వరదేనట... బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్


వరల్డ్ కప్ లో భాగంగా భారత్, ఐర్లాండ్ మధ్య గ్రూప్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భారత బౌలింగును ఉమేశ్ యాదవ్ ప్రారంభించగా, ఐర్లాండ్ బ్యాటింగును ఆ జట్టు కెప్టెన్ విలియమ్ ఫోర్టర్ ఫీల్డ్, పాల్ స్టిర్లింగ్ లు ప్రారంభించారు. వచ్చీరాగానే ఫోర్టర్ ఫీల్డ్ తాను ఎదుర్కొన్న నాలుగో బంతినే బౌండరీ దాటించి, భారీ స్కోరు చేసేస్తామని సంకేతం ఇచ్చాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న సెడాన్ పార్క్ స్డేడియంలో పరుగుల వరద పోటెత్తనుందట. స్టేడియం చిన్నగా ఉండటంతో పిచ్ ను బ్యాటింగ్ కు అనుకూలంగా మలచినట్లు క్యూరేటర్ చెప్పారు. బ్యాటింగ్ లైనప్ లో ఇరు జట్లూ బలంగా ఉండటంతో ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారనుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News