: భారత్ తో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్
వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా మరికాసేపట్లో భారత్, ఐర్లాండ్ ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ నగరం హామిల్టన్ లోని సెడాన్ పార్క్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ టాస్ నెగ్గింది. భారత్ కు ఫీల్డింగ్ అప్పగించిన పసికూన, తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. గత మ్యాచ్ లో ఆడిన సభ్యులతోనే టీమిండియా బరిలోకి దిగింది. గ్రూప్-బీలో ఇప్పటికే టాప్ పొజిషన్ లో ఉన్న టీమిండియా, ఇకపై అన్ని మ్యాచ్ ల్లో నెగ్గాలని నిర్ణయించుకున్నట్టే ఉంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించి, వరల్డ్ కప్ లో వరుసగా తొమ్మిది మ్యాచ్ లలో నెగ్గిన రికార్డును నెలకొల్పాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది. మరోవైపు ఇప్పటికే మూడు మ్యాచ్ లలో నెగ్గిన ఐర్లాండ్, డిఫెండింగ్ చాంపియన్ ను మట్టికరిపించి సత్తా చాటాలని భావిస్తోంది.