: జాతీయ గీతానికి, పతాకకు గౌరవం ఇవ్వకపోతే...అతను దేశంలో ఉండడానికి అర్హుడు కాడు:అక్బరుద్దీన్ ఒవైసీ


జాతీయ గీతానికి, పతాకకు గౌరవం ఇవ్వని వ్యక్తి దేశంలో ఉండడానికి అర్హుడు కాదని ఎంఐఎం పార్టీ శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎవరైతే తనకు చెందిన విద్యా సంస్థల్లో జాతీయగీతాన్ని పాడించరో, అలాంటి వ్యక్తి జాతీయ గీతానికి అవమానం జరిగిందనడం హాస్యాస్పదం అంటూ ఎమ్మెల్యే వసంతకుమార్ చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ స్పందించారు. జాతీయ గీతానికి, పతాకానికి, చిహ్నానికి గౌరవం ఇవ్వని వ్యక్తికి దేశంలో ఉండే అర్హత లేదని అన్నారు. ఆ వ్యక్తి ఎవరో బహిరంగపర్చాలని డిమాండ్ చేశారు. అది ఎమ్మెల్యే బాధ్యత అని అన్నారు.

  • Loading...

More Telugu News