: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వీరే
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వైఎస్సార్సీపీ ప్రకటించింది. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కోలగట్ల వీరభద్రస్వామి అభ్యర్థిత్వాలను వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఖరారు చేశారు. కాగా, ఇతరుల పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ, రెండో దఫా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సందర్భంగా చూద్దామని చెప్పినట్టు సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పుగోదావరి జిల్లా వ్యక్తి కాగా, కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం జిల్లాకు చెందిన వారు.