: కార్యకర్తలకు సమయం కేటాయించండి...సిఫారసు లేఖలు జాగ్రత్త: బాబు
కార్యకర్తలకు సమయం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ సమస్యలుంటే తనకు చెప్పాలని అన్నారు. టీటీడీ సిఫారసుల లెటర్లను జాగ్రత్తగా వినియోగించాలని ఆయన సూచించారు. నెలలో 20 రోజులు సిఫారసు లేఖలకు ప్రాధాన్యత లభించేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి కోటిన్నర చొప్పున నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు సూచించారు. నిధుల లేమి ఉండడంతో అది సాధ్యమవుతుందో లేదో పరిశీలిస్తానని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మంత్రులు కలుగజేసుకోవద్దని ఆయన సూచించారు.