: విద్యుత్ ఉత్పత్తిలో నాలుగో స్థానంలో భారత్
ప్రపంచ విద్యుదుత్పత్తిలో భారతదేశం నాలుగో స్థానంలో నిలిచిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రాజ్యసభలో ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, హైడ్రో, బొగ్గు, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తితో భారత్ ఈ ర్యాంకు సాధించిందని అన్నారు. పవన విద్యుదుత్పత్తిలో భారత్ ప్రపంచంలో ఐదో ర్యాంకు సాధించిందని, సౌర విద్యుదుత్పత్తిలో 11వ స్థానంలో ఉన్నామని ఆయన ప్రకటించారు. భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా, విద్యుత్ ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. భారత్ కంటే ముందు స్థానాల్లో చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఉన్నాయి.