: ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు ప్రారంభమయ్యాయి
ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు ప్రారంభమయ్యాయి. ఏపీ కొత్త రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం సమీకరించిన భూముల్లో పనులు ప్రారంభించారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ పనులను ప్రారంభించారు. కౌలు రైతులకు చెక్కులు పంపిణీ చేసిన నేలపాడు నుంచే భూ ఒప్పంద ప్రక్రియ మొదలు పెట్టారు. 37 మంది రైతులకు 33 లక్షల రూపాయలు పంపిణీ చేసిన అనంతరం వారి పొలాల్లో అధికారులు పనులు ప్రారంభించారు. భూములను చదును చేసి కంచెవేయనున్నారు.