: నెటిజన్ల ఛాంపియన్ టీమిండియా


వరల్డ్ కప్ టోర్నీ కీలక దశకు చేరుకుంటోంది. లీగ్ దశ పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇంతవరకు విశ్లేషకుల అంచనాలు తల్లకిందులు చేస్తూ జట్లు రాణించాయి. చాంపియన్లుగా నిలుస్తాయని ఊహించిన జట్లు అందరి అంచనాలను తల్లకిందులు చేశాయి. దీంతో ఈఎస్పీఎన్ ఛానెల్ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో టీమిండియా నయా ఛాంపియన్ గా ప్రశంసలు అందుకుంటోంది. తొలుత ఛాంపియన్ల స్థానానికి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు ఫేవరేట్లు కాగా, న్యూజిలాండ్ అండర్ డాగ్ గా నిలిచింది. టీమిండియా సెమీస్ వరకు చేరుకుంటుందని అంతా జోస్యం చెప్పారు. టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి టీమిండియా ఆటతీరు మారిపోయింది. చాంపియన్ తీరుతో ప్రత్యర్థులను చిత్తుచేసింది. ఒత్తిడిలో కూడా నిబ్బరంగా ఆడి విజయం సాధించి, ఛాంపియన్ గా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని నిరూపించుకుంది. దీంతో తాజా సర్వేలో 38 శాతం ఓట్లతో ఛాంపియన్ గా నిలిచే అర్హత ఉందని టీమిండియా నిరూపించుకుంది. కాగా, అండర్ డాగ్ గా బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు అత్యుత్తమ ఆటతీరు, 33శాతం ఓట్లతో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచే అర్హత ఉందని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఈ సారి ఛాంపియన్లు సౌతాఫ్రికా అని టోర్నీ ముందు భావించిన అభిమానులు 20 శాతం మంది మాత్రమే ఆ జట్టుపై నమ్మకముంచారు. కేవలం 11శాతం ఓట్లతో ఆసీస్ తనపై ఉంచిన నమ్మకాన్ని కోల్పోయింది.

  • Loading...

More Telugu News