: గ్రూప్ 'ఎ'లో క్వార్టర్స్ చేరిన జట్లివే...!


ప్రపంచకప్ లో నేడు జరిగిన ఒక్క మ్యాచ్ ఫలితంతో ప్రపంచ కప్ గ్రూపు 'ఎ'లో క్వార్టర్స్ బెర్తులన్నీ ఖరారయ్యాయి. గ్రూపు టాపర్ న్యూజిలాండ్ (10), రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (7) ఇది వరకే నాకౌట్ చేరాయి. ఈ గ్రూపు నుంచి మరో రెండు బెర్తుల కోసం శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ రేసులో నిలవగా, చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఇంగ్లండ్ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్ (7)తో పాటు శ్రీలంక (6) ఇతర మ్యాచ్ల ఫలితాలతో ప్రమేయం లేకుండా నేరుగా క్వార్టర్స్లో ప్రవేశించాయి. కివీస్, ఆసీస్, బంగ్లా, లంక జట్లు మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ పాయింట్ల ఆధారంగా స్థానాలు మారినా, క్వార్టర్స్ బెర్తులు మాత్రం ఖరారైపోయాయి. ఇదే గ్రూపు నుంచి ఇంగ్లండ్ (2) అఫ్ఘానిస్థాన్ (2), స్కాట్లాండ్ (0) టోర్నీ నుంచి నిష్ర్కమించాయి.

  • Loading...

More Telugu News