: ఢిల్లీలో కుతుబ్ మీనార్ వద్ద కాల్పుల కలకలం


దేశ రాజధాని నడిబొడ్డున కాల్పుల కలకలం రేగింది. ఢిల్లీలోని ప్రముఖ చారిత్రాత్మక కట్టడం కుతుబ్ మీనార్ వద్ద గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా, నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే కుతుబ్ మీనార్ వద్ద కాల్పుల శబ్దం వినబడడంతో కలకలం రేగింది. యాత్రికులు ఆందోళనకు గురయ్యారు. కొందరు సందర్శకులు పరుగులు తీశారు. యాత్రికులు, సిబ్బంది ఫిర్యాదుతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిపింది ఎవరు? ఎలా ఉంటారు? అనే దానిని ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News