: జమ్మూకాశ్మీర్లో నాలుగు నెలల శీతాకాలం సెలవుల తరువాత తెరుచుకున్న బడులు


నాలుగు నెలల శీతాకాలం సెలవుల తరువాత జమ్మూకాశ్మీర్ లో నేడు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రాథమిక పాఠశాలలు తెరుచుకునేందుకు మరో వారం రోజులు పడుతుందని విద్యాశాఖ తెలిపింది. శ్రీనగర్ లో ఆ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ షౌకత్ బేగ్ మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులు, స్వైన్ ఫ్లూ దృష్ట్యా శీతాకాలం సెలవులను మూడుసార్లు పొడిగించినట్టు తెలిపారు. మామూలుగా అయితే ఫిబ్రవరి 23న పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉందని ఆయన చెప్పారు. కాగా, ప్రాథమిక పాఠశాలలను ఈ నెల 16న తెరుస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News