: తుళ్లూరులో తొలి విడత పంపిణీ నేడే...మొత్తం 33 లక్షలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సమీకరణ గ్రామాల్లో ప్రభుత్వం నేటి నుంచి రైతులకు కౌలు మొత్తం చెల్లించనుంది. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు తుళ్లూరు మండలం నేలపాడు గ్రామం నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో తొలి విడతగా 33 లక్షల రూపాయలను రైతులకు అందజేయనున్నారు. ఇకపై విడత విడతలుగా రైతులకు పరిహారం అందజేస్తామని ఆంధ్రప్రభుత్వం తెలిపింది.