: కష్టాల్లో ఇంగ్లండ్... ఒకే ఓవర్లో బెల్, మోర్గాన్ అవుట్


బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు కష్టాల్లో పడింది. 276 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ 27 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. పేసర్ రూబెల్ హుస్సేన్ ఒకే ఓవర్లో బెల్ (63), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0) లను అవుట్ చేశాడు. ప్రస్తుతం రూట్ (11 బ్యాటింగ్), టేలర్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 153 పరుగులు చేయాలి. 23 ఓవర్లు అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు, బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 275 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News