: అసెంబ్లీనా... రౌడీ రాజ్యమా?: సీపీఐ నారాయణ


తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న అవాంఛనీయ పరిణామాలపై సీపీఐ నేత నారాయణ తనదైన శైలిలో స్పందించారు. అసెంబ్లీనా... రౌడీ రాజ్యమా? అని ప్రశ్నించారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ... కొందరు సభ్యుల తీరు సవ్యంగా లేదని విమర్శించారు. ఇకపై అసెంబ్లీ సీట్లు రౌడీలు, గూండాలు, మల్లయుద్ధ ప్రవీణులకు కేటాయిస్తే బాగుంటుందని వ్యంగ్యాస్త్రం విసిరారు. ఇంతకుముందోసారి టీఆర్ఎస్ సభ్యులు బెంచీలు ఎక్కి గవర్నర్ పైనే దాడికి యత్నించారని, తాజాగా, టీడీపీ సభ్యులు బెంచీలు ఎక్కి ఆందోళనకు యత్నిస్తున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా నుంచే తెలంగాణ సర్కారుపై తమ పోరాటం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News