: ఈ చిన్నారి మృత్యుంజయురాలు... కారు నదిలో పడి తల్లి మృతి... ప్రాణాలతో బయటపడ్డ 18 నెలల పాప!


ప్రమాదవశాత్తూ నదిలో పడ్డ కారులో, పక్కనే అచేతనంగా ఉన్న తల్లిని చూస్తూ 14 గంటలపాటు తల్లకిందులుగా కాలం గడిపిందో చిన్నారి. ఈ ఘటన యూఎస్ లోని సాల్ట్ లేక్ సిటీలో జరిగింది. ఒక బ్రిడ్జ్ పై నుంచి కారు నదిలో పడిపోగా, కారు నడుపుతున్న లిన్ గ్రోయిస్ బెక్ (25) అక్కడికక్కడే మృతి చెందింది. పక్కనే తన 18 నెలల కూతురును సీట్ బెల్ట్ సాయంతో కదలకుండా చేయడంతో ప్రమాదంలో ఆ పాపకు ఎటువంటి గాయాలూ కాలేదు. ఘటన జరిగిన 14 గంటల అనంతరం ఒక మత్స్యకారుడిచ్చిన సమాచారంతో కారును బయటకు తీయగా ప్రాణాలతో ఉన్న పాప కనిపించింది. ఆ పాపను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సుమారు 14 గంటల పాటు 0 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఆ చిన్నారి క్షేమంగా ఉండటం అద్భుతమని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News