: బీజేపీ రాజకీయాలు దేశాన్ని నట్టేట ముంచుతాయి: మిత్రపక్షంపై శివసేన ఫైర్
బీజేపీ జమ్మూకాశ్మీర్లో అధికారం కోసం పీడీపీతో పొత్తు కుదుర్చుకోవడంపై మిత్రపక్షం శివసేన మండిపడుతోంది. పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయీద్ తో కుమ్మక్కు రాజకీయాలకు తెరదీయడం సబబు కాదని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే విమర్శించారు. బీజేపీ రాజకీయాలు దేశాన్ని నట్టేట ముంచుతాయని అభిప్రాయపడ్డారు. పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పైవిధంగా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పాకిస్థాన్, ఉగ్రవాద సంస్థలు తోడ్పడ్డాయని ముఫ్తీ మహ్మద్ సయీద్ పేర్కొనడం ప్రజలను అవమానపరచడమేనని అన్నారు.