: టీఆర్ఎస్ సర్కారుకు చావుడప్పు ఎలా కొట్టాలో చూపిస్తా: మోత్కుపల్లి


తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో దళితులకు, మహిళలకు చోటుకల్పించలేదంటూ టీటీడీపీ నేతలు ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కారుకు చావుడప్పు ఎలా కొట్టాలో తాను చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వంటి దొంగలు నిత్యం దళితులను వంచిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. శాసనసభలో కేసీఆర్ దొరతనం ప్రదర్శిస్తున్నారని, ఆయన గొంతు మూగబోయే సమయం వచ్చిందని అన్నారు. మోసాలను ఎదుర్కొనే సత్తా టీటీడీపీకి ఉందని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News