: మంచి స్కోరు చేసిన బంగ్లాదేశ్... ఇంగ్లాండ్ లక్ష్యం 276
అడిలైడ్ లో ఇంగ్లాండుతో జరుగుతున్న క్రికెట్ పోరులో బంగ్లాదేశ్ జట్టు రాణించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగుకు దిగిన బంగ్లా జట్టు... మహ్మదుల్లా (138 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 103 పరుగులు), రహీమ్ (77 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 89 పరుగులు) రాణించగా, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. మరికాసేపట్లో 276 పరుగుల లక్ష్యంతో ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగనుంది.